రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబు విడుదల

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-18 12:17:35  IST  )

మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు.....

రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) రాజమండ్రి జైలు(Rajahmundry Jail) నుంచి విడుదలయ్యారు. సంక్రాంతి లక్కీ డ్రా కేసు(Sankranthi lucky draw case)లో బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. అయితే బుధవారం ఆయన జైలు నుంచి బయటకు రావడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ జైలు నుంచి తాను బయటకు రాకుండా చేయాలని కొందరు చాలా ప్రయత్నం చేశారని ఆరోపించారు. తన కుటుంబ సభ్యులను సైతం వేధించారని వ్యాఖ్యానించారు. బాధితులను లోపల వేశారని, క్రిమినల్స్‌ను వదిలేశారని, అన్నింటికీ దేవుడే సమాధానం చెబుతారని అంబటి తెలిపారు.

కాగా అంబటిపై రాష్ట్రంలో 36 కేసులు నమోదు అయ్యాయి. సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసుతో పాటు గుంటూరులో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసు, సంక్రాంతి సందర్భంగా సత్తెనపల్లిలో నిర్వహించిన లక్కీ డ్రాలో అవకతవకలకు పాల్పడ్డారని నమోదైన కేసులోనూ ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ మూడు కేసుల్లోనూ అంబటికి బెయిల్ మంజూరు అయింది. తాజాగా సంక్రాంతి లక్కీ డ్రా కేసులో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

FLASH : అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్.. మరో కేసులో బెయిల్ మంజూరు

Next Story