ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి: కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-06 16:52:59  IST  )

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై నెలకొన్న సుదీర్ఘ ఉత్కంఠకు తెరపడింది.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి: కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై నెలకొన్న సుదీర్ఘ ఉత్కంఠకు తెరపడింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్ర న్యాయశాఖ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు-2026'పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో ఇది చట్టరూపం దాల్చింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది. ఈ గెజిట్ నోటిఫికేషన్ 2024 జూన్ 2వ తేదీ నుంచి పాతకాలం (Retrospective effect) నుంచి అమలులోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. సరిగ్గా పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగిసిన రోజు నుంచే అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేశారు.

చట్టబద్ధత..

గతంలో ఉన్న 'మూడు రాజధానుల' ప్రతిపాదనలకు తావులేకుండా, సెక్షన్ 5(2)కు సవరణలు చేస్తూ అమరావతిని ఏకైక రాజధానిగా కేంద్రం గెజిట్‌లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో అమరావతికి అత్యున్నత స్థాయి స్టాట్యూటరీ (Statutory) హోదా లభించింది. భవిష్యత్తులో రాజకీయ మార్పులు సంభవించినా రాజధానిని మార్చడం అంత సులభం కాకుండా ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. ఈ పరిణామంతో అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

ఏపీ ఐటీ రంగంలో కీలక ఘట్టం.. ఏప్రిల్ 28న భారీ గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

Next Story