- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > ఏపీ > విశాఖపట్నం > ఏపీ ఐటీ రంగంలో కీలక ఘట్టం.. ఏప్రిల్ 28న భారీ గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన
ఏపీ ఐటీ రంగంలో కీలక ఘట్టం.. ఏప్రిల్ 28న భారీ గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన
by Ramesh Naini |
విశాఖపట్నం వేదికగా 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో నెలకొల్పనున్న ‘గూగుల్ డేటా సెంటర్’ నిర్మాణ పనులు ఏప్రిల్ 28న అధికారికంగా ప్రారంభం కానున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. విశాఖపట్నం వేదికగా 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో నెలకొల్పనున్న ‘గూగుల్ డేటా సెంటర్’ నిర్మాణ పనులు ఏప్రిల్ 28న అధికారికంగా ప్రారంభం కానున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ చేతుల మీదుగా భూమి పూజ చేయనున్నారు.
15 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించే ఈ సెంటర్ కోసం.. ప్రభుత్వం విశాఖ పరిసరాల్లోని మూడు చోట్ల మొత్తం 601.4 ఎకరాలను కేటాయించింది. గూగుల్ అనుబంధ సంస్థ అయిన ‘రైడెన్ ఇన్ఫోటెక్’, ‘అదానీ ఇన్ఫ్రా’ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసి, జులై 2028 నాటికి ఈ డేటా సెంటర్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Next Story






