టెన్త్ ఫెయిల్ విద్యార్థులకు అలర్ట్.. మే 25 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-30 07:24:33  IST  )

రాష్ట్రంలో ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులకు విద్యాశాఖ తీపి కబురు అందించింది...

టెన్త్ ఫెయిల్ విద్యార్థులకు అలర్ట్.. మే 25 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో(Tenth Exam Results) ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులకు విద్యాశాఖ(Education Department) తీపి కబురు అందించింది. విద్యార్థులు తమ విద్యాసంవత్సరాన్ని కోల్పోకుండా ఉండేందుకు వెంటనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల(Advanced Supplementary Examinations) షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ పరీక్షలను మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులే కాకుండా, ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవాలనుకునే వారికి కూడా మంచి అవకాశం కల్పించారు.

మే 1 నుంచి ఆలస్య రుసుం లేకుండా పరీక్ష ఫీజు

అయితే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మే 1 నుంచి మే 9 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ గడువు ముగిస్తే, రూ. 50 ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. విద్యార్థులు తమ సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. పరీక్షల కోసం ఇప్పటి నుంచే సిద్ధమైతే మంచి ఫలితాలు సాధించవచ్చని విద్యాశాఖ అధికారులు సూచించారు.

రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ సౌకర్యం

కాగా కేవలం పరీక్షలే కాకుండా, తమకు వచ్చిన మార్కులపై నమ్మకం లేని విద్యార్థుల కోసం రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. రీకౌంటింగ్ కోరుకునే వారు ఒక్కో సబ్జెక్టుకు రూ. 500, రీ వెరిఫికేషన్ (జవాబు పత్రాల నకలు) కావాలనుకునే వారు ఒక్కో సబ్జెక్టుకు రూ. 1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం మే 1 నుండి మే 7 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇచ్చారు. కాబట్టి విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు.

Breaking: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల

Next Story