Breaking: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-30 07:25:27  IST  )

ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. 2026 విద్యాసంవత్సారం పబ్లిక్ పరీక్షలకు సంబంధించి మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఎక్స్ వేదికగా ఈ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి...

Breaking: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ(Ap)లో పదో తరగతి పరీక్షా ఫలితాలు(Tenth Exams Results Release) విడుదల అయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరం పబ్లిక్ పరీక్షలకు సంబంధించి మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) చేతుల మీదుగా ఎక్స్ వేదికగా ఈ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పరీక్షల్లో విద్యార్థులు 85.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 87.90 శాతం ఉత్తీర్ణతతో బాలికలు పైచేయి సాధించగా బాలురులు 82.68 శాతం ఉత్తీర్ణత సాధించారు.

కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6..30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకూ పకడ్బందీగా ఎగ్జామ్స్ జరిగాయి. ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ bse.ap.gov.in ద్వారా మార్కుల మెమోను డౌన్ లోడ్ చేసుకునే వీలు కల్పించారు. అలాగే మన మిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా ఫలితాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

టెన్త్ ఫెయిల్ విద్యార్థులకు అలర్ట్.. మే 25 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు

నారా లోకేశ్ ట్వీట్..

Next Story