- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయవాడలో విషాదం.. వృద్ధుడి ప్రాణాలు తీసిన చపాతీ ముక్క
చపాతీ ముక్క వృద్ధుడి ప్రాణాలు తీసింది....

దిశ, వెబ్ డెస్క్: చపాతీ ముక్క(Chapati Piece) వృద్ధుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన విజయవాడ చిట్టినగర్(Vijayawada Chittinagar)లో జరిగింది. కేఎల్ రావునగర్‌కు చెందిన తోట ప్రసాద్ రోజు మాదిరిగా శుక్రవారం సాయంత్రం చపాతీ తినేందుకు రెడీ అయ్యారు. అయితే తినడం ప్రారంభించిన కొద్దిసేపటికే చిన్న చపాతీ ముక్క గొంతులో ఇరుక్కుంది. బయటకు తీసేందుకు ప్రసాద్ చాలా ప్రయత్నం చేశారు. ఇంతలో ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కిందపడిపోయి గిలాగిలా కొట్టుకుంటున్నారు. కుటుంబ సభ్యులు గమనించి నీళ్లు తాగించారు. అయితే ఫలితం లేకపోవడంతో వెంటనే 108ను పిలిపించి ఆస్పత్రికి తరలించారు. ఈలోపే వృద్ధుడు తోట ప్రసాద్ మృతి చెందారు. వైద్యులు పరీక్షించి ప్రసాద్ చనిపోయారని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. కేఎల్ రావు నగర్‌లో తోట ప్రసాద్‌కు మంచి పేరుంది. ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించిన ప్రసాద్ ఇక లేరని తెలిసి స్థానికులు కూడా విషాదం(Tragady) వ్యక్తం చేశారు.
Read More..






