తెనాలి చెంచుపేటలో ఘోరం.. వ్యక్తి దారుణ హత్య

by Thanuru Gopichand |   (  Updated:2026-01-10 11:02:49  IST  )

సంఘటనతో స్థానికంగా కలకలం.

తెనాలి చెంచుపేటలో ఘోరం.. వ్యక్తి దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్ : తెనాలిలోని చెంచుపేటలో (Tenali Chenchupeta) ఘోరం జరిగింది. ఓ వ్యక్తి దారుణ హత్యకు (Murder) గురైన సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం షేక్ ఫయాజ్ (50) ఏసీ మెకానిక్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగులు అతడిని మట్టుబెట్టారు. కర్రలు, రాడ్లతో కొట్టడంతో ఫయాజ్ అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు. ఈ సంఘటనతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది. నివాసితులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సంఘటనా స్థలంలో ఉన్న వారికి సమాచారం కోసం విచారించారు. తద్వారా ప్రాథమిక ఆధారాలను సేకరించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే గత ఏడాది అక్టోబరు నెలలో కూడా ఇదే ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అమర్తులూరు మండలంలోని కోడితాడిపర్రు గ్రామానికి చెందిన బుజ్జిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయాడు. దీంతో బుజ్జి అక్కడికక్కడే మృతి చెందాడు. వరుస హత్యలతో తెనాలి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

READ MORE .....

జార్జిపేటలో దారుణం.. అర్చకుడిపై కొడవలితో దాడి

Next Story