జార్జిపేటలో దారుణం.. అర్చకుడిపై కొడవలితో దాడి

by Thanuru Gopichand |   (  Updated:2026-01-10 11:06:03  IST  )

ఆలయ వ్యవస్థపై నానాటికీ పెరిగిపోతున్న దాడులు.

జార్జిపేటలో దారుణం.. అర్చకుడిపై కొడవలితో దాడి
X

దిశ, వెబ్ డెస్క్ : కాకినాడ జిల్లా (Kakinada) పరిధిలోని జార్జిపేట గ్రామంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఆలయ అర్చకుడిపై (Temple Priest) కొడవలితో దాడి జరిగింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా గ్రామంలో కలకలం రేగింది. అర్చకుడిపై హత్యాయత్నం జరగడంతో దేవాలయానికి వచ్చే భక్తుల్లో భయాందోళన రేకెత్తింది. పోలీసుల వివరాల ప్రకారం జార్జిపేట గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఎప్పటిలాగే అర్చకుడు రోజువారీ పూజలను చేస్తున్నాడు. స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో శనివారం వాగ్వాదం జరిగింది. ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో అది కాస్త దాడికి దారి తీసింది. ఆవేశానికి లోనైన స్థానికుడు చేతికందిన కొడవలి తీసుకొచ్చి అర్చకుడిపై దాడికి తెగబడ్డాడు. అతని దాడిలో అర్చకుడి భుజంపైన, కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అర్చకుడికి రక్తస్రావం అవ్వడంతో గమనించిన స్థానికులు వెంటనే యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు కోరంగి పోలీసు స్టేషనుకు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

READ MORE .....

తెనాలి చెంచుపేటలో ఘోరం.. వ్యక్తి దారుణ హత్య

Next Story