- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలం ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం
శ్రీశైలం ఘాట్ రోడ్డులో (Srisailam Ghat Road) ఓ ఘోర ప్రమాదం తప్పింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీశైలం ఘాట్ రోడ్డులో (Srisailam Ghat Road) ఓ ఘోర ప్రమాదం తప్పింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travels Bus) అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసుల వివరాల ప్రకారం వైజాగ్ నుంచి శ్రీశైలంకు కొందరు ప్రయాణికులు పయనమయ్యారు. అందుకోసం శ్రీ దుర్గా ట్రావెల్స్ కు సంబంధించిన బస్సును ఎక్కారు. బస్సు ఘాట్ రోడ్డు పై ప్రయాణం చేస్తూ వస్తున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు పెద్దదోర్నాల-శ్రీశైలం రహదారిలోని అటవీ శాఖ చెక్ పోస్ట్ సమీపానికి చేరుకున్న తరువాత ప్రమాదం జరిగింది. చెక్ పోస్ట్ సమీపంలో బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. దీంతో ఒక్కసారిగా బస్సు ఘాట్ రోడ్డుకు సంబంధించిన రక్షణ గోడవైపు వెళ్లింది. ఈ ఆకస్మిక ఘటనతో బస్సులో ప్రయాణిస్తున్న వారు భయాందోళనలకు గురయ్యారు. కాసేపటికి ప్రమాద ఘటన నుంచి కోలుకున్నారు. అటుగా వెళ్తున్న వారి సహకారంతో బస్సులో నుంచి కిందకు దిగారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. సుమారు 40 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో ప్రయాణికులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.






