- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేగంగా వచ్చిన మృత్యువు
వేగంగా వచ్చిన కారు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన కొల్చారం మండలం పోతన్ శెట్టిపల్లి టీ పాయింట్ వద్ద సోమవారం ఉదయం జరిగింది.

దిశ, మెదక్ ప్రతినిధి : వేగంగా వచ్చిన కారు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన కొల్చారం మండలం పోతన్ శెట్టిపల్లి టీ పాయింట్ వద్ద సోమవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లాకు చెందిన శ్రీధర్ రెడ్డి ఘనపూర్ ఐఎంఎల్ డిపోలో పని చేస్తున్నాడు. విధుల్లోకి వెళ్తున్న క్రమంలో బైక్ ఆపుకొని టీ తాగేందుకు నడుచుకుంటూ వెళ్తుండగా హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీధర్ రెడ్డికి తీవ్ర గాయాలై మృతి చెందగా కారు రోడ్డు కిందకు వెళ్లిపోయింది. అతి వేగం వల్లనే ప్రమాదం జరిగినట్టు సమాచారం. కారులో ఫ్లవర్ డెకరేషన్ కోసం వేస్తున్న వాళ్ళు ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వారు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






