- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉమ్రా పేరుతో నిలువు దోపిడీ: రూ. 4 కోట్లతో పాతబస్తీ కిలాడీ పరార్!
ఆధ్యాత్మిక యాత్ర పేరుతో సామాన్యులను ఓ ముఠా నిలువునా ముంచేసింది. పవిత్ర ఉమ్రా యాత్రకు పంపిస్తామంటూ నమ్మబలికి అమాయక భక్తుల నుంచి ఓ వ్యక్తి భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు...

దిశ, వెబ్ డెస్క్: ఆధ్యాత్మిక యాత్ర పేరుతో సామాన్యులను ఓ ముఠా నిలువునా ముంచేసింది. పవిత్ర ఉమ్రా యాత్ర(Umra Yatra)కు పంపిస్తామంటూ నమ్మబలికి అమాయక భక్తుల నుంచి ఓ వ్యక్తి భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు. తక్కువ ధరకే యాత్ర చేయిస్తామని ఆశ చూపారు. పుణ్యం దక్కుతుందని భావించిన వందలాది మంది బాధితులు ఆ కిలాడీని నమ్మి తమ కష్టార్జితాన్ని సమర్పించేసుకున్నారు. ఈ ఘటన కర్నూలు పాతబస్తీ(Kurnool Old City)లో జరిగింది.
కోట్లలో వసూళ్లు.. వెయ్యి మంది బాధితులు
పాత బస్తీకి చెందిన వ్యక్తి కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోనిలోనూ ఉమ్రా యాత్ర ప్రచారం చేశారు. ఒక్కొక్కరి నుంచి సుమారు రూ. 40 వేలు చొప్పున దాదాపు వెయ్యి మంది నుంచి ఏకంగా రూ. 4 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. యాత్ర తేదీ దగ్గరపడుతున్నా ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో అనుమానం వచ్చిన బాధితులు ఆయన్ను నిలదీశారు.
కటకటాల్లోకి నిందితుడు
మాయమాటలతో కాలయాపన చేస్తూ ముఖం చాటేస్తున్న నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు విచారణ జరుపుతున్నారు. పవిత్రమైన యాత్ర పేరుతో ఇంత పెద్ద ఎత్తున మోసానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో ఈ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.






