Markapuram Bus Accident : బస్సు ప్రమాదంలో 12 మంది సజీవదహనం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-26 04:52:56  IST  )

మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేస్తూ అధికారులు, పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Markapuram Bus Accident  : బస్సు ప్రమాదంలో 12 మంది సజీవదహనం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మార్కాపురం జిల్లా రాయవరం (Rayavaram) వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్‌ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడం, మంటలు చెలరేగి అందులోని ప్రయాణికులు సజీవదహనం కావడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి మార్కాపురం జిల్లా యంత్రాంగంతో ఫోన్‌లో మాట్లాడారు. క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన సుమారు 20 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు వివరించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రమాదానికి గల కారణాలపై తక్షణమే దర్యాప్తు జరిపి, పూర్తి నివేదిక అందజేయాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, మృతుల కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు.

మార్కాపురం బస్సు ప్రమాదం.. డీఎస్పీ నాగరాజు కీలక ప్రకటన

Next Story