- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మల్లారెడ్డి, సీఎంఆర్ విద్యాసంస్థల్లో జేఎన్‌టీయూహెచ్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
by Batti.Sumithra |
మేడ్చల్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, సీఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో జేఎన్‌టీయూహెచ్ అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

X
దిశ, మేడ్చల్ : మేడ్చల్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, సీఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో జేఎన్‌టీయూహెచ్ అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కళాశాలల అకడమిక్, పరిపాలనా రికార్డులతో పాటు వివిధ విభాగాలకు సంబంధించిన పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. తనిఖీలు కొనసాగుతున్న సమయంలో కళాశాల ప్రాంగణంలోకి ఎవరినీ అనుమతించకుండా అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ తనిఖీలకు గల కారణాల పై జేఎన్‌టీయూహెచ్ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తనిఖీల అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Next Story






