Markapuram Bus Accident : మార్కాపురం బస్సు ప్రమాదం.డీఎస్పీ నాగరాజు కీలక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-26 04:53:26  IST  )

మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదంపై డీఎస్పీ నాగరాజు కీలక ప్రకటన చేశారు. రాయవరం వద్ద టిప్పర్ ఢీకొనడంతో హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 12 మంది సజీవదహనమయ్యారని తెలిపారు.

Markapuram Bus Accident : మార్కాపురం బస్సు ప్రమాదం.డీఎస్పీ నాగరాజు కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మార్కాపురం డీఎస్పీ నాగరాజు (DSP Nagaraju), సీఐ సుబ్బారావు కీలక ప్రకటన చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనపై ఆయన హుటాహుటిన సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిబూడిదైందని, అందులో ఉన్న 12 మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్లు తెలిపారు. ఇంకా బస్సులోనే మృతదేహాలు ఉన్నాయని, వాటిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో మరో 28 మందికి గాయాలు కాగా, వారందరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రమాదంలో మృతి చెందిన వారంతా కనిగిరి, పామూరు ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. ‘హరికృష్ణ ట్రావెల్స్’ (Harikrishna Travels)కు చెందిన బస్సు నిర్మల్ నుంచి వింజమూరుకు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. చీమకుర్తి నుంచి కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్, రాయవరం వద్ద బస్సును బలంగా ఢీకొట్టిందని ఆయన వివరించారు. ఈ క్రమంలో టిప్పర్ డీజిల్ ట్యాంకర్ పగిలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని, ఆ మంటలు బస్సుకు అంటుకోవడంతో క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైందని డీఎస్పీ నాగరాజు వెల్లడించారు.

టిప్పర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. మంటల్లో 10 మంది సజీవదహనం!

Next Story