కాశీబుగ్గ తొక్కిసలాటలో 10 మంది మృతి.. మంత్రి ఆనం అధికారిక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-01 08:48:50  IST  )

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 10 మంది భక్తులు మృతి చెందినట్లుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Aanam Ramnarayana Reddy) అధికారికంగా ప్రకటించారు.

కాశీబుగ్గ తొక్కిసలాటలో 10 మంది మృతి.. మంత్రి ఆనం అధికారిక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 10 మంది భక్తులు మృతి చెందినట్లుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Aanam Ramnarayana Reddy) అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుర్ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందజేస్తున్నామని తెలిపారు. కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి రాదని.. ప్రైవేటు ఆలయమని అన్నారు. అయినా, ప్రైవేటు ఆలయాల్లో కూడా భద్రతపై ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. పర్వదినాల్లో జాగ్రత్త చర్యలపై సూచనలు చేస్తున్నామని అన్నారు. కానీ, ప్రైవేటు ఆలయాలు తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదని తెలిపారు. ఆలయం కెపాసిటీ 5 వేలు మాత్రమేనని.. ఇవాళ కార్తీక ఏకాదశి కావడంతో 25 వేల మంది భక్తులు రావడంతోనే తొక్కిసలాట చోటుచేసుకుందని మంత్రి ఆనం తెలిపారు.

Read More..

భక్తులు మరణించడం అత్యంత దురదృష్టకరం : డిప్యూటీ సీఎం

Next Story