- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భక్తులు మరణించడం అత్యంత దురదృష్టకరం : డిప్యూటీ సీఎం
శ్రీకాకుళం జిల్లా, పలాస - కాశీబుగ్గ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి వేలాదిగా భక్తులు పోటెత్తారు.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీకాకుళం జిల్లా, పలాస - కాశీబుగ్గ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి వేలాదిగా భక్తులు పోటెత్తారు. తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు మరణించారు. ఈ దుర్ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. తొక్కిసలాటలో 9 మంది భక్తులు మరణించడం అత్యంత దురదృష్టకరం అన్నారు. వారిలో చిన్నారి కూడా ఉండటం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం (AP Govenment) అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. వారు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారిని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికంగా విశిష్టమైన రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల వద్ద భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేలా, ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలని అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు.
Read More..
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు






