- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
by Kema Shiva Kumar |
కార్తీక ఏకాదశి వేళ కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కార్తీక ఏకాదశి వేళ కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు ఏడుగురు భక్తులు మృతి చెందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. అదేవిధంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే జరిగిన ఘటనపై తాజాగా ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పందించారు. కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ముఖ్యంగా భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. గాయపడిన వారికి సత్వర చికిత్స అందించాలని పేర్కొన్నారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
Next Story






