బాలయ్య అఖండ దెబ్బకు.. హడలిపోయిన అమెరికన్ థియేటర్లు

by  |
బాలయ్య అఖండ దెబ్బకు.. హడలిపోయిన అమెరికన్ థియేటర్లు
X

దిశ, సినిమా : నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా అఖండ. ‘సింహ’, ‘లెజెండ్’ తర్వాత బోయపాటి, బాలయ్య కాంబోలో మూడో చిత్రం కావడంతో ఈ మూవీ భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. థియేటర్లలో బొమ్మ పడినప్పటినుంచి ఈ సినిమా పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా పాజిటివ్ టాక్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల ఊచకోత మొదలు పెట్టింది. ఈ సినిమాలో డైలాగ్స్ ఆటం బాంబుల్లాగా పేలుతున్నాయి. మూవీలో హిందూ ధర్మం గురించి, హిందూ టెంపుల్స్ పరిరక్షణ గురించి వార్నింగ్ ఇస్తూ చెప్పిన డైలాగులకు విమర్శకులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడని కాలర్ ఎగరేస్తున్నారు ఫ్యాన్స్. కేవలం ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ బాలయ్య రికార్డులు బద్దలు కొడుతున్నాడు. సాధారణంగా బాలకృష్ణ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ తక్కువగానే ఉంటుంది. కానీ, అఖండ మాత్రం అక్కడ కూడా అద్భుతాలు చేస్తోంది. యూరోపియన్ కంట్రీస్‌లో కరోనా హడలు పుట్టిస్తున్నా.. బాలయ్య శివతాండవానికి థియేటర్స్‌కు రాకుండా అభిమానులను ఆపలేకపోతున్నది. కాగా, బాలయ్య రీ సౌండ్‌కు ఏకంగా అమెరికన్ థియేటర్స్ బాక్సులు తట్టుకోవటం లేదు.

తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌కు అక్కడి థియేటర్ యాజమానులు గడగడ వణికిపోతున్నారు. ఇదేక్కడి మాస్ సినిమారా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు. ‘జై బాలయ్య సాంగ్‌కు’ అభిమానులు చేస్తున్న హంగామాకు కుయ్యో ముర్రో అంటున్నారు. ఈ తరుణంలో తమన్ మ్యూజిక్ BGMకు తట్టుకోలేమంటూ ఏకంగా ఓ అమెరికన్ థియేటర్ నోటీసు కూడా జారీ చేసింది. అఖండ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్ వల్ల తమ స్పీకర్లు పాడయ్యే ప్రమాదం ఉందని దీనిని బాలయ్య అభిమానులు అర్ధం చేసుకోవాలని ఆ నోటీసులో కోరింది. ఇప్పుడా ఆ నోటీస్ నెటింట్ట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ స్పందిస్తూ ‘‘బాలయ్య బాబు దెబ్బకు హడలిపోయిన అమెరికన్ థియేటర్లు.. బాలయ్య బాబు తోపు, దమ్ముంటే ఆపు అంటూ’’ కామెంట్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

అఖండ ఎఫెక్ట్.. మూవీ చూస్తూ బాలయ్య అభిమాని మృతి.. ఎక్కడో తెలుసా.?



Next Story

Most Viewed