- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AIRTEL బంపర్ ఆఫర్.. రూ.6000 క్యాష్ బ్యాక్
<p>దిశ, డైనమిక్ బ్యూరో : విజయదశమి సందర్భంగా మొబైల్ కంపెనీలు భారీగా ఆఫర్లు ప్రకటించాయి. వీటితో పాటు ఆన్లైన్ షాపింగ్ సైట్స్ అయిన అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు కూడా 50 శాతం వరకూ తగ్గింపు ఇస్తూ యూజర్స్‌ని ఆకర్శించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఎయిర్టెల్ కూడా పండుగ సీజన్‌ని క్యాచ్ చేసుకొని మరింత యూజర్లను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో ఓ కొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది. స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేవారికి రూ.6వేలు క్యాష్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్దమైంది. అయితే, […]</p>

దిశ, డైనమిక్ బ్యూరో : విజయదశమి సందర్భంగా మొబైల్ కంపెనీలు భారీగా ఆఫర్లు ప్రకటించాయి. వీటితో పాటు ఆన్లైన్ షాపింగ్ సైట్స్ అయిన అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు కూడా 50 శాతం వరకూ తగ్గింపు ఇస్తూ యూజర్స్‌ని ఆకర్శించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఎయిర్టెల్ కూడా పండుగ సీజన్‌ని క్యాచ్ చేసుకొని మరింత యూజర్లను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో ఓ కొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది. స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేవారికి రూ.6వేలు క్యాష్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్దమైంది. అయితే, రూ.12వేలలోపు ధర ఉన్న వివిధ బ్రాండ్లకు చెందిన 150 స్మార్ట్‌ఫోన్ మోడళ్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే, ఈ ఆఫర్ పొందేందుకు యూజర్లకు గట్టి టాస్కే ఇచ్చింది. క్యాష్‌బ్యాక్ పొందాలంటే కస్టమర్ ప్రతినెలా రూ.249 రీచార్జ్ చేయించుకోవాలి. దీనిని క్రమం తప్పకుండా 36 నెలల పాటు రీఛార్జి చేయాలి. అప్పుడు తొలి 18 నెలల తర్వాత రూ.2వేలు, 36 నెలల తర్వాత మిగిలిన రూ.4వేలు క్యాష్‌బ్యాక్ కింద ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో జమ చేస్తారు. ఇలా మొబైల్ కొన్న 36 నెలల్లో రూ.6వేలు పొందే అవకాశం ఉంది.






