సమంత డివోర్స్ ట్వీట్ పై సిద్దార్థ్ క్లారిటీ.. ఎవరో బాధపడితే నాకేం సంబంధం

1081

దిశ, వెబ్‌డెస్క్: సమంత- చైతన్య విడాకుల రోజు హీరో సిద్దార్థ్ చేసిన ట్వీట్ ఎంతటి సంచలనంగా మారిందో చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరూ విడాకులపైనే సిద్దార్థ్ `ఛీటర్స్ నెవర్ ప్రోస్పర్` అనే ట్వీట్ చేశాడని నెట్టింట అభిమానులు దుమ్మెత్తిపోశారు. ఇక తాజాగా ఈ ట్వీట్ పై సిద్దార్థ్ స్పందించాడు. తానెవరిని ఉద్దేశించి ఆ ట్వీట్ పెట్టలేదని క్లారిటీ ఇచ్చాడు. ‘మహా సముద్రం’ ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న సిద్దార్థ్ ఈ ట్వీట్ పై మాట్లాడుతూ “ప్రతిరోజూ నేను నా మనసులో ఉన్నది ఏదైనా ట్వీట్ చేస్తాను. ఆరోజు కూడా నార్మల్ గానే చేశాను.  నేను వీధి కుక్కల గురించి ట్వీట్ చేస్తే.. అది వారిని ఉద్దేశించినది అని.. ప్రజలు ఎవరైనా తమని ఉద్ధేశించి అనుకుంటే నేను బాధ్యత వహించను” అని సిద్ధార్థ్ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. సిద్దార్థ్  కుక్కలతో పోలుస్తూ ఈ విషయం క్లారిటీ ఇవ్వడం అనేది నెటిజన్లకు మింగుడు పడడంలేదు. సిద్దార్థ్ కొంచెం ఘాటుగా చెప్పినా నిజమే చెప్పాడని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.

ఒకప్పుడు సామ్ – సిద్దార్థ్ రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లకే  వారి బంధం బ్రేక్ అయ్యింది. అప్పుడు కూడా సమంతతో సిద్ధార్థ్ బ్రేకప్ అంటూ మీడియా కథనాలొచ్చిన క్రమంలో ఒక ట్వీట్ చేసి సిద్ధార్థ్ వార్తల్లో నిలిచాడు. మరి ఈ హీరో కావాలనే ట్వీట్స్ పెడుతున్నాడో..? లేక అతను చెప్పినట్లు అందరు అలా ఊహించుకొంటున్నారో అర్థంకావడం లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు.

వైరలవుతున్న తమన్నా వీడియో

ఆ పని చేస్తే న్యూడ్ ఫోటో పంపిస్తా.. పోర్న్ స్టార్ బంపర్ ఆఫర్

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..