స్టార్ హీరోయిన్‌ను పట్టించిన పిల్లి, గుర్రం.. నిందితుడితో సంబంధమున్నట్లే!

by Shyam |   (  Updated:2021-12-05 03:29:24  IST  )

<p>దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ మధ్య మూవీస్ కంటే ఎక్కువగా మనీ లాండరింగ్ కేసు వల్లనే వార్తల్లో నిలుస్తోంది. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌తో సంబంధం ఉన్నట్లు పుకార్లు రావడంతో ఈ అమ్మడికి  సమస్యలు ప్రారంభమయ్యాయి. అయితే ముందుగా తనెవరో తెలియదని బుకాయించినా.. సుఖేశ్‌తో క్లోజ్‌గా ఉన్న పిక్స్ తను చెప్పేదంతా అబద్ధమని ప్రూవ్ చేశాయి. దీంతో ఈడీ అధికారులు ఆమెపై ఫోకస్ పెంచేశారు.  తాజాగా [&hellip;]</p>

స్టార్ హీరోయిన్‌ను పట్టించిన పిల్లి, గుర్రం.. నిందితుడితో సంబంధమున్నట్లే!
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ మధ్య మూవీస్ కంటే ఎక్కువగా మనీ లాండరింగ్ కేసు వల్లనే వార్తల్లో నిలుస్తోంది. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌తో సంబంధం ఉన్నట్లు పుకార్లు రావడంతో ఈ అమ్మడికి సమస్యలు ప్రారంభమయ్యాయి. అయితే ముందుగా తనెవరో తెలియదని బుకాయించినా.. సుఖేశ్‌తో క్లోజ్‌గా ఉన్న పిక్స్ తను చెప్పేదంతా అబద్ధమని ప్రూవ్ చేశాయి. దీంతో ఈడీ అధికారులు ఆమెపై ఫోకస్ పెంచేశారు.

తాజాగా ఈ భామ పై కళ్ళు చెదిరే మరో వార్త బయటకు వచ్చింది. ఈడీ ఛార్జిషీట్‌ ప్రకారం సుఖేష్ నుంచి జాక్వెలిన్ దాదాపుగా రూ. 10 కోట్లతో పాటు రూ. 52 లక్షల ఖరీదైన గుర్రం, రూ.9 లక్షల పెర్షియన్ పిల్లి కూడా బహుమతిగా పొందిందని తెలుస్తోంది. అంతేకాదు సుఖేష్ తీహార్ జైలులో ఉన్నప్పుడు సైతం జాక్వెలిన్‌ తనతో ఫోన్‌లో మాట్లాడిందని సమాచారం. బెయిల్ వచ్చాక.. ప్రైవేట్ విమానంలో చెన్నైకి వెళ్లిన జాక్వెలిన్, సుఖేష్ స్టార్ హోటల్‌లో గడిపారని టాక్. కేవలం వీరిద్దరి విమాన ప్రయాణానికి రూ.8 కోట్లు ఖర్చు చేసినట్లు ఈడీ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఈ కేసుతో జాక్వెలిన్ సినీ కెరీర్‌కు బ్రేక్ పడే అవకాశం ఉండగా.. అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వామ్మో ఏంటీ ఈ అరాచకం.. పుష్పలో అనసూయ పిక్

చైతుతో విడాకులు.. ట్రోల్స్‌పై తాజాగా స్పందించిన సామ్

Next Story