వామ్మో ఏంటీ ఈ అరాచకం.. పుష్పలో అనసూయ పిక్

2445

దిశ, వెబ్‌డెస్క్ : బుల్లితెర స్టార్ నటి, జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందాలతో ఎప్పటికప్పుడు ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. ఓవైపు తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. అంతే కాకుండా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తూ తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది అనడానికి రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త క్యారెక్టర్ చెప్పవచ్చు. రంగమ్మత్త క్యారెక్టర్‌లో అనసూయ చాలా ఒదిగిపోయింది.

 ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో అనసూయ దాక్షాయణి అనే ఓ నెగిటివ్ రోల్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే  పుష్ప సినిమా నుంచి అనసూయ లుక్  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లుక్‌లో అనసూయను చూసినవారందరూ షాక్ అవుతున్నారు. ఒంటిపై కొంగు లేకుండా నోటిలో బ్లేట్‌తో ఉన్న అనసూయ లుక్ చూస్తే ఎవరైనా సరే భయపడవలిసిందే. ఈ పొటోలో మంచం పై ఉన్న వ్యక్తిని అనసూయ అతి దారుణంగా చంపుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఎమైనా ఈ లుక్‌లో అనసూయను చూసిన వారందరూ ఫిదా అయిపోతున్నారు. రంగమ్మత్త కన్న దాక్షాయణిగా అనసూయ మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని మరికొందరు ముచ్చటిస్తున్నారు. కాగా, పుష్ప సినిమాలో సునీల్ భార్యగా అనసూయ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

సమ్మర్‌ లుక్‌లో పిచ్చెక్కిస్తున్న బుట్టబొమ్మ.