ఒకడు రేప్ చేస్తే మరొకడు వీడియోలు తీశాడు.. వాటిని కాబోయే భర్తకు సెండ్ చేశాడు

by  |
rape-video-record1
X

దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకు కొంతమంది వ్యక్తులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్లు నెత్తికెక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అవతలివాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోయే ఓ యువతిపై ఇద్దరు దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అదంతా కూడా వీడియో తీసి కాబోయే భర్తకు పంపించారు. తెలిసిన సమాచారం మేరకు.. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఓ యువతి(20) దినసరి కూలీగా పని చేస్తూ ఉండేది. అయితే, ఆ యువతి తన గ్రామం నుంచి ప్రతి రోజూ జిల్లా కేంద్రానికి వచ్చి కూలి పని చేసుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోయేది.

ఈ క్రమంలో అత్తగారింటి వద్ద ఉన్న తన భార్య కోసం ప్రతిరోజూ ఇతర గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో కూలికి వెళ్లే యువతికి ఆ వ్యక్తి తన బండిపై అప్పుడప్పుడు లిఫ్ట్ ఇచ్చేవాడు. ఇలా తీసుకెళ్తున్న క్రమంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇటీవల ఒకరోజు కూలి పని దొరకకపోవడంతో ఆ యువతి తిరిగి ఇంటికి బయలుదేరింది. అప్పుడప్పుడు ఆ యువతికి బైక్ పై లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి తన స్నేహితుడితో అక్కడికి వచ్చాడు. మేం మీకు పని ఇప్పిస్తామంటూ ఆ యువతిని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. అంతేకాదు.. అదంతా కూడా వీడియో తీసి కాబోయే భర్తకు పంపించినట్లు తెలిసింది. కాబోయే భర్త ఆ వీడియోలను యువతి తల్లిదండ్రులకు చూపించడంతో విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినట్లుగా సమాచారం..

కన్నతల్లే హంతకురాలు.. దానికి అలవాటు పడి తమ పిల్లలతో భిక్షాటన చేయిస్తూ.


Next Story

Most Viewed