- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏటీఎంలకు నిప్పంటించిన ‘దొంగల ముఠా’!
by Batti.Sumithra |
<p>హైదరాబాద్‌లో ఓ దొంగల ముఠా.. ఏటీఎం దోచుకునేందుకు ప్లాన్ వేసింది. చోరీ చేసే క్రమంలో ఏటీఎంలకు ఆయిల్ పూసినా.. అవి తెరుచుకోకపోవడంతో వాటికి నిప్పంటించి పారిపోయింది. చాంద్రాయణగుట్టలోని బంగారు మైసమ్మ దేవాలయానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఐసీఐసీఐ, ఆక్సిస్ బ్యాంకుల ఏటీఎంల వద్దకు కొందరు యువకులు ఒక బృందంగా వచ్చారు. చోరీ చేసే ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో ఏటీఎంలకు నిప్పంటించి పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏటీఎం కేంద్రాల్లో మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక […]</p>

X
హైదరాబాద్‌లో ఓ దొంగల ముఠా.. ఏటీఎం దోచుకునేందుకు ప్లాన్ వేసింది. చోరీ చేసే క్రమంలో ఏటీఎంలకు ఆయిల్ పూసినా.. అవి తెరుచుకోకపోవడంతో వాటికి నిప్పంటించి పారిపోయింది. చాంద్రాయణగుట్టలోని బంగారు మైసమ్మ దేవాలయానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఐసీఐసీఐ, ఆక్సిస్ బ్యాంకుల ఏటీఎంల వద్దకు కొందరు యువకులు ఒక బృందంగా వచ్చారు. చోరీ చేసే ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో ఏటీఎంలకు నిప్పంటించి పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏటీఎం కేంద్రాల్లో మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను ఆర్పినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను సీసీ కెమెరాల సహాయంతో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
Next Story






