- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఎంబీ సినిమాస్ వర్క్ స్టార్ట్స్
<p>సూపర్ స్టార్ మహేష్ బాబు దూకుడు చూపిస్తున్నాడు. అటు సినిమాల్లో సూపర్‌స్టార్‌గా, ఇటు వ్యాపారంలో సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మేన్‌గా దూసుకుపోతున్నాడు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లో ఏఎంబీ సినిమాస్‌ను స్థాపించిన మహేష్ మంచి లాభాలు గడిస్తున్నాడు. తర్వాత ద హంబుల్ కో బ్రాండ్ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టి ఆన్‌లైన్ షాపింగ్ మింత్రాతో జతకట్టి ట్రెండింగ్ అయ్యాడు. ఇప్పుడు ఇంకొంచెం అప్‌డేట్‌గా ఆలోచించాడు ఈ బిజినెస్‌మేన్. బెంగుళూరులో తెలుగు సినిమాలకు ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ […]</p>

సూపర్ స్టార్ మహేష్ బాబు దూకుడు చూపిస్తున్నాడు. అటు సినిమాల్లో సూపర్‌స్టార్‌గా, ఇటు వ్యాపారంలో సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మేన్‌గా దూసుకుపోతున్నాడు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లో ఏఎంబీ సినిమాస్‌ను స్థాపించిన మహేష్ మంచి లాభాలు గడిస్తున్నాడు. తర్వాత ద హంబుల్ కో బ్రాండ్ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టి ఆన్‌లైన్ షాపింగ్ మింత్రాతో జతకట్టి ట్రెండింగ్ అయ్యాడు.
ఇప్పుడు ఇంకొంచెం అప్‌డేట్‌గా ఆలోచించాడు ఈ బిజినెస్‌మేన్. బెంగుళూరులో తెలుగు సినిమాలకు ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఏఎంబీ సినిమాస్ స్టార్ట్ చేసేద్దామని అనుకున్నాడు. పక్కా సక్సెస్ అయ్యే స్థలాన్ని ఎంచుకున్నాడు. బెంగుళూరులో ఫేమస్ అయిన కపాలి థియేటర్‌ను పడగొట్టి ఆ స్థానంలో ఆరు స్క్రీన్లతో ద గ్రాండ్ మజెస్టిక్ మాల్ ఏర్పాటు చేయనున్నారట. అందులోనే ఏఎంబీ సినిమాస్ ఉంటుందని సమాచారం. హైదరాబాద్‌లో మాదిరిగానే బెంగుళూరులోనూ ఇంటీరియర్ అదిరిపోనుందట. ఇక వైజాగ్, విజయవాడలోను ఏఎంబీ సినిమాస్ స్థాపించే ప్రయత్నాల్లో ఉన్న మహేష్ మంచి ప్లేస్ కోసం వెతుకుతున్నాడట.






