గొప్ప మనసు చాటుకున్న ZPTC.. ఏం చేశారంటే.?

by Sridhar Babu |
గొప్ప మనసు చాటుకున్న ZPTC.. ఏం చేశారంటే.?
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలం లంకమల్లారం గ్రామపంచాయతీలో కుటుంబ పోషణ లేక విలవిలలాడుతున్న 200 పేద కుటుంబాలకు జడ్పీటీసీ పోశం నరసింహారావు బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఆదివారం లంకమల్లారం గ్రామపంచాయతీని సందర్శించిన ఆయన గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో కొన్ని కుటుంబాలకు కనీస కుటుంబ పోషణ లేక ఇబ్బందులు పడుతున్నారని జడ్పీటీసీ దృష్టికి గ్రామస్తులు తీసుకువచ్చారు.

ఈ క్రమంలో పోశం.. మండలంలో ఉన్న జీటీఎస్ఎస్ఎస్ సంస్థతో మాట్లాడి గ్రామంలో 200 కుటుంబాలకు బియ్యం, నెలకు సరిపడ సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ పోశం మాట్లడుతూ.. కరోనా మహమ్మారి వల్ల, పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ గ్రామ ప్రజలకు కుటుంబ పోషణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. లంకమల్లారం గ్రామ ప్రజలకు నేను అండగా ఉంటానని అన్నారు. గ్రామ ప్రజలెవరూ అధైర్యపడవద్దని నిత్యం అందుబాటులో ఉంటానని వారికి భరోసా కల్పించారు.

గ్రామ ప్రజలకు ఎవరికైనా ఇబ్బందులు వస్తే నాకు వెంటనే తెలపాలని కోరారు. ఈ క్రమంలో ఆయన జీటీఎస్ఎస్ఎస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను పోశం.. సరుకులు పంపిణీ చేయడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీటీఎస్ఎస్ఎస్ సంస్థ సభ్యులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Next Story