కొత్త ట్విస్ట్.. యువతికి జొమాటో డెలివరీ బాయ్ రివర్స్ షాక్

by  |
కొత్త ట్విస్ట్.. యువతికి జొమాటో డెలివరీ బాయ్ రివర్స్ షాక్
X

దిశ,వెబ్ డెస్క్:గత కొన్ని రోజులుగా జొమాటో డెలివరీ బాయ్ -యువతి మధ్య జరిగిన వివాదానికి సంబంధించిన న్యూస్ క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఫుడ్‌ డెలివరీ ఆలస్యం కావడంతో ఆ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసినందుకు జొమాటో డెలివరీ బాయ్ తనపై దాడికి పాల్పడ్డాడని హితేషా చంద్రాని అనే యువతి పోలిస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు డెలివరీ బాయ్ కామరాజ్ ను అరెస్ట్ చేశారు.ఇక తాజాగా ఈ ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది.

బెయిల్ మీద బయటికి వచ్చిన డెలివరీ బాయ్ కామరాజ్ తనపై నిందలు వేసిన యువతి హితేషా మీద కేసు పెట్టాడు. కామరాజ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు యువతి మీద ఐపీసీ 341, 355, 504 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసు లో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను ఏ తప్పు చేయలేదని, డెలివరీ ఆలస్యం అయినందుకు తానే క్షమాపణలు కోరానని తెలిపాడు. అంతేకాకుండా సదరు యువతి తనను అసభ్య పదజాలంతో దూషించిందని, ఇన్ని ఆరోపణలు చేసి తనను అవమానపర్చడంతోనే తనపై కేసు పెట్టానని జొమాటో ఉద్యోగి కామరాజ్ తెలిపాడు. ఇక ఈ విషయమై కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో డిబేట్ కూడా నడుస్తుంది. కొంతమంది యువతికి మద్దతు తెలుపుతుంటే.. మరికొంతమంది డెలివరీ బాయ్ కి సపోర్ట్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.


Next Story

Most Viewed