బాత్‌రోబ్‌లో ఎయిర్‌పోర్టుకు వచ్చిన యాక్టర్

by  |
బాత్‌రోబ్‌లో ఎయిర్‌పోర్టుకు వచ్చిన యాక్టర్
X

దిశ, సినిమా : ‘కుంకుమ భాగ్య’ సీరియల్ నటుడు జీషన్ ఖాన్ గిన్నిస్ బుక్‌లో ఎక్కేందుకు చేసిన ప్రయత్నాన్ని ఎయిర్‌పోర్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించి తన యూట్యూబ్‌ చానల్‌లో ఓ వీడియో కూడా పోస్టు చేసిన జీషన్.. బాత్‌రోబ్(స్నానపు దుస్తులు)లోనే గోవా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చేశాడు. అంతేకాదు అవే దుస్తుల్లో ఫ్లైట్ ఎక్కేందుకు అటెంప్ట్ చేసినట్లుగా వీడియోలో తెలుస్తోంది. ఈ స్టంట్ ద్వారా వరల్డ్ రికార్డ్ నెలకొల్పాలని అనుకున్నా.. తన దగ్గరికి వచ్చిన ఎయిర్ ఇండియా సిబ్బంది, బాత్‌రోబ్‌లో ట్రావెల్ చేయడం కుదరదని చెప్పడంతో విరమించుకోక తప్పలేదు. అయితే ఈ పూర్తి సంఘటనను వివరించిన జీషన్.. ‘మనకు ఉన్నది ఒకటే జీవితం, దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. పబ్లిక్‌లో బాత్‌రోబ్ ధరించడం సరైంది కాదని ఎవరు డిసైడ్ చేశారు? నాకు కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు మిగతావాళ్లకు ఏంటి ప్రాబ్లమ్? నాకు నచ్చినట్టు నేనుంటా’ అంటూ ప్రశ్నించాడు. కాగా ఈ ఇన్సిడెంట్‌పై జీషన్‌కు మద్దతిస్తున్న ఫ్యాన్స్.. తనకు నచ్చినట్టు బతుకుతాడని అంటున్నారు. ‘యు ఆర్ మై హీరో జీషన్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Next Story

Most Viewed