బ్రాడ్‌పిట్ ట్రైన్ ఎక్కిన జాజీబీట్జ్

by  |
బ్రాడ్‌పిట్ ట్రైన్ ఎక్కిన జాజీబీట్జ్
X

దిశ, వెబ్‌డెస్క్: అట్లాంటా స్టార్ జాజీ బీట్జ్.. సోనీ రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘బుల్లెట్ ట్రైన్’లో నటించే అవకాశం దక్కించుకుంది. హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాను డేవిడ్ లేయిచ్ దర్శకత్వం వహిస్తున్నాడు. జాక్ ఒకెవిక్జ్ స్ర్కిప్ట్ అందిస్తున్న ఈ సినిమా.. ఇసాకా కోటర్స్ జపనీస్ నవల ‘మారియా బీటిల్’ ఆధారంగా తెరకెక్కుతోంది. జోయ్ కింగ్, ఆరోన్ టేలర్ జాన్సన్, బ్రియాన్ టైరీ, హెన్రీ, ఆండ్రూ కోజిలు కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

‘డెడ్‌పూల్ 2’ సినిమాతో సత్తా చాటిన జాజీ బీట్జ్.. బ్రాడ్ పిట్ పక్కన హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బీట్జ్ ప్రస్తుతం జేమ్స్ సామ్యూల్స్ ‘ద హర్డర్ దే ఫాల్ ’ చిత్రంలో నటిస్తోంది. ‘ద జోకర్ : లూసీ ఇన్ ద స్కై, వూండ్స్ అండ్ హై ఫ్లైయింగ్ బర్డ్’ ఆమె నటించిన ఇతర చిత్రాలు.

Next Story

Most Viewed