సల్మాన్ చాన్స్ ఇస్తే.. కత్రిన కన్నెర్రజేసింది!

153
Zareen Khan, Katrina Kaif, Salman Khan

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్.. తనను కత్రినా కైఫ్‌తో పోల్చడం వల్లనే కెరీర్‌లో ఎదగలేకపోయానని బాధపడింది. ఎప్పుడూ కత్రినలా ఉన్నావని కంపేర్ చేయడమే తప్ప.. తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు మేకర్స్ ఒక్క అవకాశం ఇవ్వలేదని, దీంతో కత్రిన ఇమేజ్ నుంచి బయటకు వచ్చేందుకు తనకు దారి లేకుండా పోయిందని వాపోయింది.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ రిలేషన్ బ్రేకప్ అయిన టైమ్‌లో.. కత్రినాకు పోటీగా తన పోలికలతో ఉన్న జరీన్ ఖాన్‌‌ను ‘వీర్’ సినిమా హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక సల్మాన్ అండతో జరీన్ స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్నా.. ఈ చిత్రం తర్వాత ఆమెకు సరైన అవకాశాలు దక్కలేదు. దీనికి కారణం కత్రిన పోలికలతో ఉన్నానని మీడియా నెగెటివ్‌గా ప్రచారం చేయడమేనని అభిప్రాయపడింది జరీన్. తన సినిమా, ఇంటర్వ్యూలు రాకముందే.. ఫేస్ బుక్‌లో ఈ ప్రచారం జరిగిందని తెలిపింది. కానీ ఆ సమయంలో సోషల్ మీడియా అంత పవర్‌ఫుల్‌గా లేదని.. ప్రజలు ఎలాంటి సమాచారం కోసమైనా మీడియా హౌజ్‌లు, న్యూస్ పేపర్ల మీదే ఆధారపడేవారమని చెప్పింది. అంటే మీడియానే తన గురించి తప్పుడుగా ప్రచారం చేసిందని, దీంతో ఆడియన్స్ తనను తనలా చూసేందుకు, సొంత అవగాహన ఏర్పరుచుకునేందుకు సమయం ఇవ్వలేదని భావిస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి గాసిప్స్ స్ప్రెడ్ చేయడంతో ఆడియన్స్ కూడా అదే ఆలోచనకు వచ్చారని చెప్పింది.

ఈ సమయంలో బరువు కూడా ఇష్యూ అయిపోయిందన్న జరీన్ ఖాన్.. 100 కేజీల బరువున్న తను 40 కేజీలకు తగ్గినా సరే జనాలు తనను గుర్తించలేదని.. పైగా ‘ఫ్యాట్రిన’ అని పిలవడం మొదలెట్టారని తెలిపింది. బయట ఎలాంటి కార్యక్రమాలకు అటెండ్ అయినా సరే తన గురించి మీడియా నెగెటివ్‌గానే రాసేదని.. ఎప్పుడు తన బరువు గురించే ప్రస్తావించేదని బాధపడింది. ఇది తనను మెంటల్‌గా చాలా ఎఫెక్ట్ చేసిందని.. తను ‘నిజంగా అందంగా లేనా’ అనే భావనను తీసుకొచ్చిందని తెలిపింది జరీన్ ఖాన్.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..