అసైన్డ్ భూమి హాంఫట్...

by Batti.Sumithra |

ఖేడ్ నియోజకవర్గంలోని పెద్ద శంకరంపేట తిరుమలాపూర్ గ్రామ శివారులో ఎర్రకుంట, అసైన్డ్ భూముల పైన అధికారులు చర్చించుకుంటున్నారు.

అసైన్డ్ భూమి హాంఫట్...
X

దిశ, నారాయణఖేడ్ : ఖేడ్ నియోజకవర్గంలోని పెద్ద శంకరంపేట తిరుమలాపూర్ గ్రామ శివారులో ఎర్రకుంట, అసైన్డ్ భూముల పైన అధికారులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం భూమిపై కన్నేసిన ఓ నేత పథకం ప్రకారం కాజేశాడు. అసైన్డ్ భూమికి కబ్జా చేసి అమ్మేసి గుట్టు చప్పుడు కాకుండా ఇల్లు నిర్మించారు. కాళీ జాగా కనిపిస్తే చాలు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. రాజకీయ అండ ఉంటే ఏకంగా ఏదైనా ఆక్రమించేస్తూన్నారు. పెద్ద శంకరంపేట తిరుమలాపూర్ లో సుమారు 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. ఏకంగా ఖాళీ ప్లాట్లకు ఇంటి నంబర్లు వేసి ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క ప్లాట్... పైనే విక్రయిస్తున్నారని సమాచారం. దాదాపు 50 పైగా ఫ్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. కోట్లల్లో రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొనుగోలు చేసిన వారు కొందరు అడుగు ముందుకేసి పక్క ఇల్లు కూడా నిర్మించుకున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు ఏమి చేస్తున్నారనేగా మీ అనుమానం... ఈ వ్యవహారంలో అధికారులు పూర్తిగా పాత్ర అండదండలతో డూప్లికేట్ రిజిస్ట్రేషన్ చేసి అంటగట్టారు. కలెక్టర్ సార్ స్పందిస్తే గాని అసలు దొంగలు ఎవరో తెలుస్తుంది.

అధికారుల పై కూడా అనుమానాలు..

ఎంతో వేగంగా అభివృద్ధి చెందిన పెద్ద శంకరంపేట పట్టణం ఆనుకొని ఉన్న తిరుమలాపూర్ పక్కనే హైవే వెళ్లడంతో అసైన్డ్ భూమి పై అక్రమార్కుల కన్ను పడింది. ఎలాగైనా కాల్ చేయాలని ఆలోచనలోనే అధికారులతో కుమ్ముకై భూమిని తప్పుడు దృవపత్రాలతో సృష్టించి విక్రయించారు. అసైన్డ్ భూములు కబ్జాకు గురవుతున్నాయని కలెక్టర్ కు, డీఎల్ పి ఓ , డీపీఓ, ఇరిగేషన్ అధికారులకు ప్రభుత్వ భూమికి కబ్జాబ్ గురవుతుందని ఎన్ని మార్లు తెలిపిన పట్టించుకోవడం లేదన్నారు. స్వయంగా కలెక్టర్ పెద్ద శంకరం పేటకు వచ్చి నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ భూమిని వెంటనే కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని చుట్టూ కంచె వెయ్యాలని తెలిపిన అధికారుల నిర్లక్ష్యం వలన ఇప్పటివరకు దాన్ని పట్టించుకున్న దాఖలు లేవు. ఇప్పుడున్న కలెక్టర్కు తెలిపిన కూడా పట్టించుకోవడం లేదా అని ఆరోపణలు ఉన్నాయి. భూ అక్రమ దారులకు అధికారులకు మధ్య ఉన్న అంతర్గత ఒప్పందం కారణంగానే అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమిని ఇళ్ల స్థలాలుగా చేసి అమ్ముతున్న పంచుకొని తింటున్నారని చర్చ పట్టణ కేంద్రంలో జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు కబ్జా గురవుతున్న ప్రభుత్వం పై సర్వే నిర్వహించి భూమిని కాపాడాలని పెద్ద శంకరంపేట తిరుమలాపూర్ ప్రజలు కోరుతున్నారు. ఇదంతా భూ భాగవతం కారణం అప్పుడు బీఆర్ఎస్ హయంలో కబ్జా చేసి కాంగ్రెస్ సాయం లో రక్షణకు చేరి రెవెన్యూ అధికారులతో దోస్తాన్ చేస్తూ ఎర్రకుంట, అసైన్డ్ భూమి హాంఫట్...

చట్టం ఏం చెబుతోంది...?

నిబంధనల ప్రకారం.. ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు భూమి తమది అని క్లెయిమ్ చేస్తే, స్థానిక తాసిల్దార్ ఆ ఫైల్ ను కలెక్టర్ పంపాలి. కలెక్టర్ దానిని సి పి ఎల్ ఏ లేదా రెవెన్యూ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాలి. ఉన్నంత అధికారులు కమిటీ విచారణ జరిపిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలి. కానీ, ఇక్కడి స్థానిక తాసిల్దార్ కు ఈ నిబంధనలు పట్టలేదు. చట్టాలపై గౌరవం లేదు. కోట్ల రూపాయల చేతులు మారాయి అన్న ఆరోపణ నేపథ్యంతో, రూల్స్ అన్నిటిని తుంగలో తొక్కి, ప్రైవేటు వ్యక్తికి అనుకూలంగా ప్రోసిడింగ్ జారీ చేశాడు. ప్రభుత్వ ఆస్తికి రక్షకుడిగా ఉండాల్సిన అధికారి, భక్షకుడిగా మారిన తీరిది.

ఆరు నెలలకు ఒకసారి తహసీల్దార్ బదిలీ..

పెద్ద శంకరంపేట తిరుమలాపూర్ భూమి వివాదంలో ఉండడంతో ఆరు నెలలకు ఒకసారి తాసిల్దారులు బదిలీ అవుతున్నారు. చిన్న శంకరంపేట డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్ ఐదు నెలల క్రితం పెద్ద శంకరంపేట తహసీల్దార్ విధులు నిర్వహించారు. వీధి నిర్వహణలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొనడంతో జూన్ 2 న ఆయనను బదిలీ చెయ్యగా, ఆర్ ఐ నెల క్రితం బదిలీ చేసిన ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. ఎక్కువ కాలం ఏ తాసిల్దార్ ఉండలేకపోయారు. అక్రమార్కులకు కొమ్ముగాష్టంతో ఇన్చార్జి తాసిల్దార్లే ఇక్కడ ఉంటూ బదిలీ కావడంతో ఎవరికి సమాధానం పట్టడం లేదు.

Next Story