- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. వీటిపైనే చర్చ
నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హైకోర్టు భవనాల దగ్గర రూ.547 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించబోతున్నట్టు సమాచారం. అదే విధంతా ఏపీ సీఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో సీఆర్‌డీఏ అగ్నిమాపక విభాగం ఏర్పాటుపై కూడా ఈ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా అమరావతిలో పర్యాటకరంగానికి ప్రోత్సాహం కల్పించేలా పలను నిర్ణయాలు చేయనున్నారు. సిటీలో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ కు సైతం ఆమోదం తెలపనున్నారు. రాజధాని ప్రాంతంలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటుపై చర్చించనున్నారు. ఇళ్ల స్థలాలపై కూడా క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం అవకాశాలు ఉన్నాయి. పలు సంస్థలకు భూకేటాయింపులపై సైతం కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.






