Kamakshi Bhaskarla: పొలిమేర బ్యూటీ గ్లామర్ షో.. చూస్తే చూపు తిప్పుకోలేరు!

by Pulgam srinivas |

రంగురంగుల చీరలో మెరిసిన కామాక్షి భాస్కర్ల.. డీసెంట్ లుక్ వైరల్!

Kamakshi Bhaskarla: పొలిమేర బ్యూటీ గ్లామర్ షో.. చూస్తే చూపు తిప్పుకోలేరు!
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు ప్రేక్షకులకు కామాక్షి భాస్కర్ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ, ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది.




ఆ సినిమా సాధించిన విజయంతో కామాక్షి పేరు తెలుగు ప్రేక్షకుల్లో బాగా వినిపించింది. అనంతరం ‘మా ఊరి పొలిమేర 2’ కూడా మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీకి మరింత క్రేజ్ పెరిగింది. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం ఆ స్థాయి విజయాన్ని అందించలేకపోయాయి.




ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ దర్శకుడు ఎమ్మెస్ రాజు తెరకెక్కిస్తున్న ‘అగధ’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. సినిమాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కామాక్షి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.




తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో రంగురంగుల చీరలో మెరిసిపోతూ, అందుకు తగ్గ బ్లౌజ్‌తో స్టైలిష్ లుక్‌లో కనిపించింది. చేతికి వాచ్, చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్ ధరించి, నుదుటిపై చిన్న బొట్టుతో ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపించింది.




అలాగే తన జుట్టును అందంగా ముడివేసుకొని ఇచ్చిన స్టైలిష్ ఫోజులు అభిమానులను ఫిదా చేస్తున్నాయి. మొత్తంగా డీసెంట్ అండ్ క్లాసీ లుక్‌లో కామాక్షి అందాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story