అది జరగాలంటే.. షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కావాలి

by Shyam |   (  Updated:2021-08-26 06:23:41  IST  )

<p>దిశ, సంగారెడ్డి: రాజన్న యాదిలో జెండా పండుగ చేయాలని వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ఆమె పిలుపు మేరకు గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వైఎస్ఆర్‌టీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోలీస్ రామచందర్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేశారు. అనంతరం ఈ సందర్భంగా పోలీస్ రామచంద్రయ్య మాట్లాడుతూ&#8230; వైఎస్సార్ గతంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, [&hellip;]</p>

YSRTP leader Police Ramchander
X

దిశ, సంగారెడ్డి: రాజన్న యాదిలో జెండా పండుగ చేయాలని వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ఆమె పిలుపు మేరకు గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వైఎస్ఆర్‌టీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోలీస్ రామచందర్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేశారు. అనంతరం ఈ సందర్భంగా పోలీస్ రామచంద్రయ్య మాట్లాడుతూ… వైఎస్సార్ గతంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, 108, పోడు భూములకు పట్టాలు ఇవ్వడం ఇలా అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టి పేదలకు మేలు చేశారని గుర్తు చేశారు. మళ్లీ ఇలాంటి పథకాలు రావాలంటే షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని అభిప్రాయపడ్డారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ‘దళితబంధు’ పథకం తీసుకొచ్చి మరో మోసానికి తెరతీశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు డప్పు రాజు, జిల్లా నాయకులు ఎండీ ఫిరోజ్, డి. కిషోర్, పి. రాజు, జి. సురేష్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story