‘అదే జరిగితే వైసీపీ ఎంపీలు రాజీనామా.. టీడీపీ ఎంపీలు చేస్తారా?’

197

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలు ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. టీడీపీ, వైపీపీ మధ్య మాటల యుద్ధం వాడీవేడిగా జరుగుతోంది. టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీకి సవాల్ విసిరారు.

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో టీడీపీ గెలిస్తే వైసీపీ ఎంపీలందరూ రాజీనామా చేస్తారని, వైసీపీ గెలిస్తే టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తారా? అంటూ బహిరంగ సవాల్ విసిరారు. చంద్రబాబు తమ ఛాలెంజ్‌కి ఒప్పుకుంటే తాము సిద్ధమని పెద్దిరెడ్డి తెలిపారు. తిరుపతి లోక్‌సభకు జరుగుతున్న ఉపఎన్నిక జగన్ రెండేళ్ల పాలనకు రిఫరెండమ్ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..