జగన్‌పై ప్రేమ తగ్గిపోయింది.. వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పై నిత్యం విరుచుకుపడే ఆయన తొలిసారిగా జగన్ పై ప్రేమ తగ్గిందన్నారు. న్యూఢిల్లీలోని తన నివాసంలో మంగళవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన సీఎంపై తనకు గతంలో ప్రేమ ఉన్న మాట వాస్తవమేనని, కానీ ఇప్పుడు ఆ ప్రేమ తగ్గిందన్నారు. అలవాటులో పొరపాటుగా ప్రియతమ ముఖ్యమంత్రి అని వచ్చేస్తోందన్నారు. పిచ్చి కేసులు పెట్టి దొరికిపోవడం, ఆ [&hellip;]</p>

MP Raghurama krishnamraju
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పై నిత్యం విరుచుకుపడే ఆయన తొలిసారిగా జగన్ పై ప్రేమ తగ్గిందన్నారు. న్యూఢిల్లీలోని తన నివాసంలో మంగళవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన సీఎంపై తనకు గతంలో ప్రేమ ఉన్న మాట వాస్తవమేనని, కానీ ఇప్పుడు ఆ ప్రేమ తగ్గిందన్నారు. అలవాటులో పొరపాటుగా ప్రియతమ ముఖ్యమంత్రి అని వచ్చేస్తోందన్నారు.

పిచ్చి కేసులు పెట్టి దొరికిపోవడం, ఆ తర్వాత ప్రజల్లో అల్లరైపోవడం తమ పార్టీ వారికి అలవాటుగా మారిపోయిందన్నారు. ఇకనుంచి అయినా ఇవి తగ్గించుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. జగన్‌పై ఉన్న గౌరవంతో.. చెబుతున్న మాటలివి అన్నారు. ఎన్ని స్కీములు చేసినా నెల రోజులు చేయగలరని, తర్వాతైనా సరే కోర్టుకు హాజరు కావాలని సీఎం జగన్ కేసులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story