డొక్కా గెలుపు ఏకగ్రీవం కానుందా..?

101

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నుంచి వైఎస్ఆర్ సీపీలోకి వెళ్లిన డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు ఆ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేసింది. ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి జరగనున్న ఉప ఎన్నికలకు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా ఆయన పేరును పార్టీ ఖరారు చేసింది. నేడు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే, అధికారికంగా మాత్రం డొక్కా పేరును వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఆయనను పతిపాదిస్తూ పదిమంది ఎమ్మెల్యేల సంతకాలతో నేరుగా నామినేషన్ వేయించేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష టీడీపీ నుంచి బరిలో ఎవరూ లేకపోవడంతో డొక్కా గెలుపు ఏకగ్రీవం కానుంది. కాగా, నేటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..