- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీ నేత ధూళిపాళ్లపై మరో కేసు నమోదు
<p>దిశ, వెబ్‌డెస్క్: సంగం డెయిరీ వ్యవహారానికి సంబంధించి ఇటీవల టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇటీవలే విడుదలయ్యారు. బెయిల్‌పై బయటకొచ్చిన అనంతరం మే 29న ఓ హోటల్‌లో సంగం డెయిరీ పాలకవర్గ సమావేశం ధూళిపాళ్ల నరేంద్ర నిర్వహించారు. అయితే కరోనా నిబంధనలకు విరుద్దంగా ఈ సమావేశం నిర్వహించారంటూ పటమట పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ కిశోర్ కుమార్ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: సంగం డెయిరీ వ్యవహారానికి సంబంధించి ఇటీవల టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇటీవలే విడుదలయ్యారు. బెయిల్‌పై బయటకొచ్చిన అనంతరం మే 29న ఓ హోటల్‌లో సంగం డెయిరీ పాలకవర్గ సమావేశం ధూళిపాళ్ల నరేంద్ర నిర్వహించారు.
అయితే కరోనా నిబంధనలకు విరుద్దంగా ఈ సమావేశం నిర్వహించారంటూ పటమట పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ కిశోర్ కుమార్ ఫిర్యాదుతో విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ఫ్యూ అమల్లో ఉండగా హోటల్‌లో సమావేశం నిర్వహించినందుకు ఐపీసీ 269,270, రెడ్ విత్ 34,188 సెక్షన్లతో పాటు అంటువ్యాధుల చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు.
సమావేశానికి సంబంధించి సీసీ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధూళిపాళ్లతో పాటు పాలకవర్గ సభ్యులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.






