- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘లా నేస్తం’ నిధులు మంజూరు
<p>దిశ, అమరావతి బ్యూరో: సీఎం జగన్ హామీలో భాగంగా ఇచ్చిన మాటను నిజం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి నుంచి జూన్ వరకు ‘వైఎస్సార్ లా నేస్తం’ నిధులు విడుదల చేస్తూ బుధవారం ప్రకటన వెలువడింది. రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి మనోహర్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 3నెలలకు గానూ సుమారు రూ.2.91 కోట్లను 5,832 మంది జూనియర్ న్యాయవాదుల బ్యాంక్ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. కాగా, […]</p>

దిశ, అమరావతి బ్యూరో: సీఎం జగన్ హామీలో భాగంగా ఇచ్చిన మాటను నిజం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి నుంచి జూన్ వరకు ‘వైఎస్సార్ లా నేస్తం’ నిధులు విడుదల చేస్తూ బుధవారం ప్రకటన వెలువడింది. రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి మనోహర్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 3నెలలకు గానూ సుమారు రూ.2.91 కోట్లను 5,832 మంది జూనియర్ న్యాయవాదుల బ్యాంక్ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. కాగా, వృత్తిలో నిలదొక్కుకునేందుకు జూనియర్ న్యాయవాదులకు అండగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీనిని గతేడాది డిసెంబర్ 3న ప్రారంభించారు.ఈ ప్రకారం జూనియర్ న్యాయవాదులకు ఈ పథకం కింద ప్రతినెలా రూ. 5,000 చొప్పున మూడేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం చేయనుంది.ఇదిలా ఉండగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యే లా నేస్తం నిధుల విషయమై ప్రభుత్వానికి లేఖ రాశారు.ఈ క్రమంలోనే నిధులు మంజూరు కావడంతో జూనియర్ న్యాయవాదులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.






