11వ వసంతంలోకి వైసీపీ.. జగన్‌ భావోద్వేగ‌ ట్వీట్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11వ వసంతంలోకి అడుగుపెట్టింది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇవాళ పదేళ్లు పూర్తి చేసుకుని పదకొండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగ ట్వీట్ చేశారు. వైఎస్సార్‌ ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు. విలువలు, విశ్వసనీయతల పునాదులపై వైఎస్సార్‌సీపీ పురుడు పోసుకుందన్నారు. పదేళ్ల ప్రయాణంలో కష్టసుఖాల్లో [&hellip;]</p>

ys jagan
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11వ వసంతంలోకి అడుగుపెట్టింది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇవాళ పదేళ్లు పూర్తి చేసుకుని పదకొండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగ ట్వీట్ చేశారు. వైఎస్సార్‌ ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు. విలువలు, విశ్వసనీయతల పునాదులపై వైఎస్సార్‌సీపీ పురుడు పోసుకుందన్నారు. పదేళ్ల ప్రయాణంలో కష్టసుఖాల్లో తనకు అండగా నిలిచిన ప్రజలకు, కలిసి నడిచిన నాయకులకు, వెన్నంటి ఉన్న కార్యకర్తలకు సీఎం వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

Next Story