- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంత మొనగాళ్లైతే 6 గంటలు చేయండి.. టీఆర్ఎస్ నేతలపై వైఎస్ షర్మిల సెటైర్లు
<p>దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ చేపట్టిన ధర్నా ఫలితంగానే కేంద్రం 3 కొత్త సాగు చట్టాలని ఎత్తివేసిందని చెప్పుకోవడంపై వైఎస్సార్ టీపీ చీఫ్షర్మిల శనివారం ట్విట్టర్వేదికగా ఫైరయ్యారు. ముఖ్యమంత్రి కేవలం మూడుగంటల పాటు ధర్నా చేసి.. రైతు చట్టాలను రద్దు చేపించామని జబ్బలు చరుచుకోవడం హాస్యాస్పదమన్నారు. టీఆర్ఎస్ నేతలు అంత మొనగాళ్లైతే 6 గంటలు ధర్నా చేసి రైతుల వడ్లన్నీ కేంద్రం కొనేలా చేయాలని ఆమె డిమాండ్చేశారు. మంచి జరిగితే టీఆర్ఎస్ ఖాతాలో లేకుంటే ఇతరులపై […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ చేపట్టిన ధర్నా ఫలితంగానే కేంద్రం 3 కొత్త సాగు చట్టాలని ఎత్తివేసిందని చెప్పుకోవడంపై వైఎస్సార్ టీపీ చీఫ్షర్మిల శనివారం ట్విట్టర్వేదికగా ఫైరయ్యారు. ముఖ్యమంత్రి కేవలం మూడుగంటల పాటు ధర్నా చేసి.. రైతు చట్టాలను రద్దు చేపించామని జబ్బలు చరుచుకోవడం హాస్యాస్పదమన్నారు. టీఆర్ఎస్ నేతలు అంత మొనగాళ్లైతే 6 గంటలు ధర్నా చేసి రైతుల వడ్లన్నీ కేంద్రం కొనేలా చేయాలని ఆమె డిమాండ్చేశారు. మంచి జరిగితే టీఆర్ఎస్ ఖాతాలో లేకుంటే ఇతరులపై బట్ట కాల్చి మీదేయడం వారికి అలవాటేగా అంటూ సెటైర్లు వేశారు. ఇదిలా ఉండగా ఎన్నికల సమయంలో ఉత్తుత్తి హామీలు ఇచ్చినట్టు, ఉత్తుత్తి కొనుగోలు సెంటర్లను పెట్టి రైతులను మసిపూసి మారేడుకాయ చేయాలని, మోసం చేయాలని చూస్తే వదిలిపెట్టేది లేదని షర్మిల హెచ్చరించారు. సెంటర్లు పెట్టడం కాదు.. ముందు కాంటాలు పెట్టి రైతుల ధాన్యం వర్షం పాలు కాకముందే కొనాలని ఆమె డిమాండ్ చేశారు.
- Tags
- dharna






