- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వైఎస్ఆర్ లేని లోటు తీరుస్తా.. జగన్ ఆశీస్సులు ఉన్నాయి’
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని ఆమె అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో విద్యార్థులందరూ ఉచితంగా చదువుకుంటున్నారా? అని ఆమె ప్రశ్నించారు. జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. అంతేగాకుండా తనకు ఏపీ ముఖ్యమంత్రి, తన అన్న జగన్ ఆశీస్సులు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని ఆమె అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో విద్యార్థులందరూ ఉచితంగా చదువుకుంటున్నారా? అని ఆమె ప్రశ్నించారు. జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. అంతేగాకుండా తనకు ఏపీ ముఖ్యమంత్రి, తన అన్న జగన్ ఆశీస్సులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా నేతలు చాలా సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే అన్ని విషయాలు ప్రకటిస్తానని వెల్లడించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవడానికే సమావేశం నిర్వహించానని అన్నారు. అన్ని జిల్లాల నేతలను కలిసి, వైఎస్ఆర్ లేని లోటు తెలంగాణలో తీరుస్తానని స్పష్టం చేశారు.






