- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వర్షంలోనూ కొనసాగుతోన్న షర్మిల పాదయాత్ర
<p>దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్షర్మిల వర్షంలోనూ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో షర్మిల తన 13వ రోజు పాదయాత్రను సోమవారం ప్రారంభించారు. చింతపల్లి మండలం మాల్‌టౌన్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర పోలెపల్లి గ్రామం మీదుగా ఎర్రమట్టి తండా, బోటిమేడ తండా, పాలెంతండా, చౌలాతండా, చాకలిషేర్‌పల్లి గ్రామానికి చేరుకుంది. ఈ క్రమంలో వానలోనూ తడుస్తూ షర్మిల ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. భోజన విరామం అనంతరం తిరిగి మధ్యాహ్నం […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్షర్మిల వర్షంలోనూ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో షర్మిల తన 13వ రోజు పాదయాత్రను సోమవారం ప్రారంభించారు. చింతపల్లి మండలం మాల్‌టౌన్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర పోలెపల్లి గ్రామం మీదుగా ఎర్రమట్టి తండా, బోటిమేడ తండా, పాలెంతండా, చౌలాతండా, చాకలిషేర్‌పల్లి గ్రామానికి చేరుకుంది. ఈ క్రమంలో వానలోనూ తడుస్తూ షర్మిల ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. భోజన విరామం అనంతరం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు యాత్ర ప్రారంభమై ఉమ్మపురం క్రాస్ మీదుగా గొల్లపల్లి గ్రామంలో మాట ముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం సమైక్యనగర్, కుర్మేడ్ గేట్ మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది.
Next Story






