- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కల్వకుంట్ల’ సామ్రాజ్యం కొట్టుకుపోవడం ఖాయం
<p>దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కొవిడ్ బారిన పడిన బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే కరోనా సునామీలో కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవడం ఖాయమని వైఎస్ షర్మిల శనివారం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ లో చేర్చేది ఆలోచిస్తామని చెప్పి ఇప్పటికే ఎనిమిది నెలలు గడిచిపోయిందని, ఇంకెప్పుడు ఆరోగ్యశ్రీలో చేరుస్తారని ఆమె ప్రశ్నించారు. ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేక పేదలు చస్తున్నారని, చచ్చేవారు పేదలు కాదని […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కొవిడ్ బారిన పడిన బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే కరోనా సునామీలో కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవడం ఖాయమని వైఎస్ షర్మిల శనివారం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ లో చేర్చేది ఆలోచిస్తామని చెప్పి ఇప్పటికే ఎనిమిది నెలలు గడిచిపోయిందని, ఇంకెప్పుడు ఆరోగ్యశ్రీలో చేరుస్తారని ఆమె ప్రశ్నించారు.
ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేక పేదలు చస్తున్నారని, చచ్చేవారు పేదలు కాదని ప్రభుత్వం పట్టించుకోవడం లేదా, లేక పేదలు చచ్చినా అడిగేవారు ఉండరనే ధైర్యమా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ప్రభుత్వ లెక్కకు సరిపడా మరణాలు ఇంకా నమోదు కాలేదనా పేద ప్రజలను పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ పాలనపై ఇప్పటికే జనం తిరగబడుతున్నారని, కరోనా కారణంగా ఇప్పటికే పేదల బతుకులు రోడ్డున పడ్డాయని, ఇప్పటికైనా వారిని ఆదుకోకుంటే అందుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆమె పేర్కొన్నారు.






