ట్రెండింగ్‌లో యూట్యూబర్ నాగర్ ‘వర్ధాన్’ సాంగ్

by  |
ట్రెండింగ్‌లో యూట్యూబర్ నాగర్ ‘వర్ధాన్’ సాంగ్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఫరీదాబాద్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ అజే నాగర్ ఇప్పటికే తన వీడియోలతో యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేశాడు. పాఠ‌శాల విద్య‌ను మ‌ధ్య‌లో వ‌దిలేసినా ఈ యంగ్ యూట్యూబర్..‘క్యారీమినాటి’ పేరుతో చానల్ న‌డుపుతూ 28.2 మిలియ‌న్ స‌బ్‌ స్క్రైబ‌ర్ల‌‌తో దూసుకుపోతున్నాడు. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్న యూట్యూబ్ చానళ్లతో పోటీపడుతున్న నాగర్ తాజాగా ‘వర్ధాన్’ పేరుతో ఓ ర్యాప్‌సాంగ్ విడుదల చేశాడు. ఆ క్షణం నుంచి యూట్యూబ్ ట్రెండింగ్‌లో నిలుస్తోందా పాట.

సెన్సేషనల్ యూట్యూబర్ నాగర్ తన తొలి చార్ట్‌బస్టర్‌ ‘యల్గార్’‌ను ఏడు నెలల క్రితం రిలీజ్ చేయగా, నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఆ పాట ఇప్పటికీ 200 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుండగా, నాగర తన బ్రదర్ విల్లి ఫ్రెంజీ(యష్ నాగర్)తో కలిసి ‘వర్ధన్’ పేరుతో తాజాగా ఓ ర్యాప్ సాంగ్ విడుదల చేశాడు. దాంతో నాగర్ అభిమానులు ట్విట్టర్‌లో హ్యష్‌ట్యాగ్ వర్ధాన్ (#Vardaan) ట్రెండ్ చేయగా, కేవలం 20 గంటల్లోనే వర్ధన్ పాట పది మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌ లిస్ట్‌లో టాప్‌లో కొనసాగుతోంది. ప్రతి ఒక్కరూ తమ కలలను చేజ్ చేయాలంటూ, తన సక్సెస్‌ఫుల్ జర్నీని ప్రస్తావిస్తూ, తన ఫ్యాన్స్‌ను మోటివేట్ చేసే ప్రయత్నం చేశాడు నాగర్. ఈ పాటను నాగరే రాసి పాడగా, విల్లీ ప్రొడ్యూస్ చేశాడు. ఈ పాటలో నాగర్‌తో పాటు, ధనాన్ష్ అరోరా నటించారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed