క్రాస్ రోడ్‌లో కలకలం.. ఆ యువకులను ఎవరు తీసుకెళ్లారు?

by Sridhar Babu |   (  Updated:2021-10-11 04:14:51  IST  )

<p>దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్‌లో ఓ ఘటన కలకలం సృష్టించింది. స్థానికంగా మెకానిక్ షెడ్లో పని చేసే ముగ్గురు యువకులను గుర్తు తెలియని వారు ఆదివారం సాయంత్రం కారులో వచ్చి చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ముగ్గురు యువకులలో ఒకరికి బేడీలు వేయటంతో పోలీసులుగా అనుమానిస్తున్నారు. యువకులను తీసుకెళ్లిన దృష్యాలు సీ.సీ. కెమెరాలో నిక్షిప్తం కావడముతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే వీరిని ఎవరు [&hellip;]</p>

క్రాస్ రోడ్‌లో కలకలం.. ఆ యువకులను ఎవరు తీసుకెళ్లారు?
X

దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్‌లో ఓ ఘటన కలకలం సృష్టించింది. స్థానికంగా మెకానిక్ షెడ్లో పని చేసే ముగ్గురు యువకులను గుర్తు తెలియని వారు ఆదివారం సాయంత్రం కారులో వచ్చి చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ముగ్గురు యువకులలో ఒకరికి బేడీలు వేయటంతో పోలీసులుగా అనుమానిస్తున్నారు. యువకులను తీసుకెళ్లిన దృష్యాలు సీ.సీ. కెమెరాలో నిక్షిప్తం కావడముతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే వీరిని ఎవరు ఎందుకు తీసుకొని వెళ్లారు అనేది అంతు చిక్కడం లేదు.. విశ్వాసనీయ సమాచార మేరకు గంజాయి విక్రయించడము వలన సీ.సీ.యస్. పోలీసులు అరెస్టు చేసి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు. పై విషయము‌పై రూరల్ పోలీసులను సమాచారం అడుగగా తమకు ఏమి తెలియదని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. తమ పిల్లలను ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళారో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Next Story