- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీలికాంతితో.. సైబర్ సిక్‌నెస్
<p>దిశ, ఫీచర్స్: కంప్యూటర్ స్క్రీన్ నుంచి వెలువడే కాంతి మీ కళ్ళలోకి దూసుకెళ్లి, మీ తల నరాలు కొట్టుకున్నట్లుగా ఎప్పుడైనా అనిపించిందా? కంటిన్యుయస్‌గా ఫోన్‌ను చూసిన తర్వాత మైకం లేదా వికారపు భావనలు తలెత్తాయా? అంటే చాలామందిలో నిజమేననే సమాధానమే వినిపిస్తుంది. కానీ మొబైల్ స్క్రీన్‌ను ఎక్కువసేపు చూడటం వల్ల సాధారణంగానే కళ్లపై ఒత్తిడి, అలసట కలుగుతాయని లైట్ తీసుకుని ఉంటారు. వాస్తవానికి అవి సైబర్ సిక్‌నెస్‌ను ప్రతిబింబించే లక్షణాలు. వర్క్ ఫ్రమ్ హోమ్ పెరగడం, రిమోట్ […]</p>

దిశ, ఫీచర్స్: కంప్యూటర్ స్క్రీన్ నుంచి వెలువడే కాంతి మీ కళ్ళలోకి దూసుకెళ్లి, మీ తల నరాలు కొట్టుకున్నట్లుగా ఎప్పుడైనా అనిపించిందా? కంటిన్యుయస్‌గా ఫోన్‌ను చూసిన తర్వాత మైకం లేదా వికారపు భావనలు తలెత్తాయా? అంటే చాలామందిలో నిజమేననే సమాధానమే వినిపిస్తుంది. కానీ మొబైల్ స్క్రీన్‌ను ఎక్కువసేపు చూడటం వల్ల సాధారణంగానే కళ్లపై ఒత్తిడి, అలసట కలుగుతాయని లైట్ తీసుకుని ఉంటారు. వాస్తవానికి అవి సైబర్ సిక్‌నెస్‌ను ప్రతిబింబించే లక్షణాలు. వర్క్ ఫ్రమ్ హోమ్ పెరగడం, రిమోట్ లెర్నింగ్, ఆన్‌లైన్‌లో టైమ్ తెలియకుండా గంటల తరబడి గడపడం తదితర అంశాలే ఇందుకు కారణం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నెర్వస్‌నెస్‌కు గురికాకుండా నివారించేందుకు పలు మార్గాలు.
సైబర్ సిక్‌నెస్ అంటే ఏమిటి?
శారీరకంగా కదలికలు తక్కువైనపుడు కలిగే అనారోగ్య లక్షణాలను సూచించేదే సైబర్ సిక్‌నెస్. ఈ లక్షణాలను మూడు రకాలుగా వర్గీకరిస్తారు. నోసియా(వికారం), దృష్టిచాలక సమస్యలు, అయోమయ పరిస్థితి. ఇందులో కళ్లపై ఒత్తిడి, అలసట, తలనొప్పి లక్షణాలు కంటి కదలికలను నియంత్రించే నరాన్ని ఎక్కువ శ్రమకు గురిచేయడం వల్ల తలెత్తుతాయి. తలతిరగడం, మైకం కమ్మడం వల్ల అయోమయ పరిస్థితి నెలకొంటుంది. దృష్టి కేంద్రీకరణలో ఇబ్బంది, చూపు మసకబారడం వంటి పలు సైబర్‌సిక్‌నెస్ లక్షణాలు క్రమంగా వ్యాప్తిచెందుతాయి. ఈ తరహా సమస్యలు గంటల తరబడి కొనసాగి, గాఢ నిద్రను ప్రభావితం చేస్తాయి. రోజువారీ జీవితంలో కామన్‌గా ఉపయోగించే కంప్యూటర్లు, ఫోన్లు, టీవీల వల్లే యూజర్లు సైబర్ సిక్‌నెస్ లక్షణాలను ఫేస్ చేస్తారు. అయితే యూజర్లు సైబర్ సిక్‌నెస్‌ను ఫీలయ్యే విషయంలో పరిశోధకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం గమనార్హం.
మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్‌పై చూస్తున్న విజువల్స్ కదులుతున్నప్పుడు మన బాడీ నిశ్చల స్థితిలోనే ఉంటుంది. కానీ విజన్, బ్యాలన్స్‌ను నియంత్రించే శరీర భాగాల ద్వారా గ్రహించిన సమాచారంలో ఏర్పడే అసమతుల్యత వల్ల మీ శరీరం కూడా కదులుతున్నట్లుగా తెలిపే ఇన్‌ఫర్మేషన్ మీ కళ్ళకు అందుతుందని ఇంద్రియ సంఘర్షణ సిద్ధాంతం(సెన్సారీ కాన్‌ఫ్లిక్ట్) నిర్ధారించింది. కొత్తగా పుట్టుకొస్తున్న టెక్నాలజీ మాయ వల్ల విజువల్ పర్సెప్షన్(దృశ్య అవగాహన), ఫిజికల్ ఎక్స్‌పీరియన్స్ మధ్య ఈ సంఘర్షణ ఏర్పడుతుంది.
వర్చువల్, అగ్మెంటెడ్ రియాలిటీలో సైబర్‌సిక్‌నెస్
వర్చువల్, అగ్మెంటెడ్ రియాలిటీలో సైబర్‌సిక్‌నెస్ లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటాయి. VR అనేది వాస్తవ ప్రపంచం నుంచి టెక్నాలజీ సాయంతో కృత్రిమ వాతావరణాన్ని సృష్టిస్తుంది. VRలో ఎక్కువసేపు గడిపితే తీవ్రమైన స్థాయిలో వికారపు భావనలు ఏర్పడతాయి. దీనివల్ల చాలామంది వ్యక్తులు కొన్ని అప్లికేషన్స్, గేమ్స్‌కు దూరంగా ఉంటున్నా.. టెక్నాలజీ మార్పుల్లో భాగంగా రాబోయే 10 సంవత్సరాల్లో వీటిని తప్పక ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. జనాల్లో వీటి వాడకం పెరిగేకొద్దీ అది సైబర్‌సిక్‌నెస్ లక్షణాల పెరుగుదలను ప్రేరేపిస్తుంది. వర్క్, ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో ఈ టెక్నాలజీ వాడకం 60 శాతానికి పైగా పెరిగి 2027 నాటికి మరో 20 శాతం వృద్ధి చెందుతుందని మార్కెట్ పరిశోధన సంస్థ ‘రీసెర్చ్ అండ్ మార్కెట్స్’ అంచనా వేస్తోంది.
ప్రమాదకరంగా సైబర్ సిక్‌నెస్ లక్షణాలు..
సైబర్ సిక్‌నెస్ లక్షణాలతో మొదట్లో ప్రమాదం లేనప్పటికీ, ఏదైనా డివైస్‌ను ఉపయోగించిన తర్వాత 24 గంటల వరకు శరీరంపై వాటి ప్రభావం ఉంటుంది. దీర్ఘకాలికంగా ఈ లక్షణాలు ప్రమాదకరంగా మారి, శారీరక సామర్థ్యాలపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు.. తీవ్రమైన తలనొప్పి, కళ్లపై ఒత్తిడి లేదా మైకం వంటి లక్షణాల వల్ల కంటిచూపులో సమన్వయం మందగిస్తుంది. ఈ దుష్ప్రభావాలు కొనసాగితే చూపు మసకబారి, కంటికి చేతికి కోఆర్డినేషన్ దెబ్బతిని వాహనాలు నడుపుతున్నప్పుడు ప్రమాదానికి దారితీసే అవకాశముంది. దీర్ఘకాలిక సైబర్ సిక్‌నెస్ రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ప్రజల్లో అవగాహన లేదు. వ్యక్తుల ఆధారంగా సైబర్ సిక్‌నెస్ తీవ్రతలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.
సైబర్ సిక్‌నెస్‌ను ఎలా తగ్గించాలి?
కంప్యూటర్ లేదా ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగిస్తుంటే మీరు సైబర్ సిక్‌నెస్ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నట్లే. అయితే ఈ అసౌకర్యాన్ని తగ్గించేందుకు సాయపడే మార్గాలు ఉన్నాయి. బ్లూ లైట్ గ్లాసెస్.. మీ డివైస్ స్క్రీన్ నుంచి విడుదలయ్యే బ్లూ లైట్‌ను నిరోధిస్తుంది. స్క్రీన్‌పై జూమ్ చేయడం లేదా పెద్ద ఫాంట్ సైజులను ఉపయోగించడం ద్వారానూ కంటి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మీరు VR, AR అప్లికేషన్లను ప్రయత్నించడానికి ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ, మోషన్ సిక్‌నెస్‌కు గురవుతుంటే.. కళ్లకు కంఫర్ట్ రేటింగ్స్‌ను సూచించే విజువల్లీ క్యాలిబరేట్ డివైజెస్ సాయపడొచ్చు. అంతేకాదు మీ డివైసెస్‌ను ఎక్కువ సమయం ఉపయోగించాల్సి వస్తే బహిరంగ ప్రదేశాల్లో వాడటం మేలు. అసౌకర్యం కలిగితే కొద్దిసేపు గాడ్జెట్స్‌ను పక్కనబెట్టి కళ్లకు విశ్రాంతి ఇవ్వడం మంచిది.






