- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరదా తీసిన ప్రాణం.. రైలు బోగి ఎక్కి దాటే క్రమంలో..
<p>దిశ, అంబర్ పేట్ : సరదా యువకుడి ప్రాణం తీసింది. ఆగి ఉన్న గూడ్స్ రైలు పెట్రోల్ ట్యాంకర్ బోగిల పైకి ఎక్కి ఇంకొక బోగి మీదుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగుచూసింది. కాచిగూడ రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీరామ్ రెడ్డి కథనం ప్రకారం.. బుద్వేల్ రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి పెట్రోల్ ట్యాంకర్ గూడ్స్ […]</p>

దిశ, అంబర్ పేట్ : సరదా యువకుడి ప్రాణం తీసింది. ఆగి ఉన్న గూడ్స్ రైలు పెట్రోల్ ట్యాంకర్ బోగిల పైకి ఎక్కి ఇంకొక బోగి మీదుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగుచూసింది. కాచిగూడ రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీరామ్ రెడ్డి కథనం ప్రకారం.. బుద్వేల్ రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి పెట్రోల్ ట్యాంకర్ గూడ్స్ రైలు వచ్చి ఆగింది.
బుద్వేల్ శ్రీరామ్ నగర్ ప్రాంతానికి చెందిన జి. సుధాకర్ కుమారుడు గోని ప్రవీణ్(19) సరదాగా పట్టాలపై ఆపి ఉన్న గూడ్స్ రైలు పెట్రోల్ ట్యాంకర్ పైకి ఎక్కాడు. ఒకదాని నుంచి మరొక బోగి మీదకు దాటుతున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.






