- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశ్న రావణ్‌కు బిగుస్తున్న ఉచ్చు.. కస్టడీ పిటిషన్‌లో దిమ్మతిరిగే నిజాలు
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్‌కు ఉచ్చుబిగుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్ (Prashana Ravan) బచ్చలకూరి జోసెఫ్ కస్టడీ పిటిషన్‌పై ఇవాళ గన్నవరం కోర్టులో కీలక విచారణ జరగనుంది. ప్రస్తుతం దేశద్రోహం కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో కస్టడీ పిటిషన్‌పై రావణ్ తరఫు న్యాయవాదులు కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా హైదరాబాద్ (Hyderabad) సహా పలు ప్రాంతాల్లో ప్రశ్న రావణ్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అతడి భార్య ఇచ్చిన స్టేట్‌మెంట్ సైతం రికార్డు చేశారు. ఈ క్రమంలోనే రావణ్ ఆర్థిక లావాదేవీ, సోషల్ మీడియా ఖాతాల నిర్వహణపై సమగ్ర విచారణ అవసరమని పోలీసులు గన్నవరం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే, ప్రశ్న రావణ్ కస్టడీ పిటిషన్‌లో పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెట్టారు. భారత ప్రభుత్వం (Govt. Of India)పై సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వీడియోలు రూపొందించారని, దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై తీవ్ర అభియోగాలు మోపారు. అదేవిధంగా నిషేధిత ఉగ్రవాద సంస్థలు, నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా రెచ్చగొట్టేలా కంటెంట్ క్రియేట్ చేసి వదిలారని ఆరోపించారు. మరోవైపు విద్వేషపూరిత కంటెంట్ వెనుక సహకరించిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ప్రశ్న రావణ్‌ను గన్నవరం కోర్టు పోలీసుల కస్టడీకి అప్పగిస్తుందా.. లేక నిరాకరిస్తుందా అనేది వేచిచూడాల్సిందే మరి.






