భూవివాదంపై సభలో మహిళల విజ్ఞప్తి.. చంద్రబాబు కీలక ఆదేశాలు

by Ajay Maddhiboyina |

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇద్ద‌రు మహిళలు తమ భూసమస్య పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేయగా వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

భూవివాదంపై సభలో మహిళల విజ్ఞప్తి.. చంద్రబాబు కీలక ఆదేశాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇద్ద‌రు మహిళలు తమ భూసమస్య పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేయగా వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట, కడప జిల్లా రామరాజుపల్లెకు చెందిన ఇద్దరు మహిళలు తమ భూ సమస్య పరిష్కరించాలంటూ చంద్రబాబును కోరారు. చంద్రబాబు బనగానపల్లె సభకు వెళ్లగా అక్కడ మహిళలు తమ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో క‌డ‌ప జిల్లాకు చెందిన రామలక్ష్మమ్మ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సాయి దీప్తిల భూ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని సీఎం స‌భా వేదిక నుండి సీఎం హామీ ఇచ్చారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ల‌తో మాట్లాడి వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎంవోకు ఆదేశాలు జారీ చేశారు. సీఎంవో నుండి స‌మాచారం రావ‌డంతో ఆ ఇద్ద‌రు మ‌హిళ‌లు క‌లెక్ట‌రేట్ కు రావాల‌ని అధికారులు కోరారు.

Next Story